Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

చిత్తూరు/తిరుచానూరు: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నేడు సోమవారం అంకురార్పణ నిర్వహించనున్నారు. మంగళవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 8న పంచమీ తీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. సోమవారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయ ప్రాంగణంలో లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. భక్తులు వర్చువల్‌గా ఈ సేవలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. సాయంత్రం 6.30నుంచి రాత్రి 8.30గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.

Advertisement
Advertisement