Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిత్తూరులో టీడీపీ శ్రేణులను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు...ఉద్రిక్తం

చిత్తూరు: జిల్లాలోని పుంగునూరు నియోజకవర్గం కల్లూరులో ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుకు నిరసనగా నియోజకవర్గ ఇన్చార్జి చల్ల రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాగా ముందుగానే చల్లా రామచంద్ర రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కల్లూరులో కార్యకర్తలు చేపట్టిన నిరసనను వైసీపీ శ్రేణులు, పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Advertisement
Advertisement