Abn logo
Dec 5 2020 @ 08:36AM

చిత్తూరు: కొత్తకుంట చెరువుకు గండి

చిత్తూరు: జిల్లా మండల కేంద్రం సోమలకు సమీపంలోని  కొత్తకుంట చెరువుకు భారీ గండి పడింది. గత రెండు రోజులుగా నెల్లూరుతో పాటు చిత్తూరు జిల్లాలోనూ ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద ప్రవాహం నేపథ్యంలో కొత్తకుంట చెరువుకు గండి పడింది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి గండిని పూడ్చాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement