Abn logo
Apr 6 2020 @ 22:56PM

అందుకే సోషల్ మీడియాలోకి వచ్చా: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో రఫ్ఫాడిస్తారని అందరికీ తెలుసు. కానీ ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన.. అక్కడ కూడా రఫ్ఫాడిస్తున్నారు. వరుస ట్వీట్స్‌తో ఫ్యాన్స్‌ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఆయన మాటలో చెప్పాలంటే.. ఆయన ట్వీట్స్‌కి బాక్స్ బద్దలైపోతుందంతే. మరి ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడే ఎందుకిలా సోషల్ మీడియా ఎంట్రీ అని చిరంజీవిని ఆంధ్రజ్యోతి డైలీ అడిగితే.. ఏం చెప్పారో తెలుసా?


‘‘నిజం చెప్పాలంటే... ముందు నుంచీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని గానీ, దాని ఆవశ్యకత గానీ నాకు పూర్తిగా తెలియదు. పవన్‌కల్యాణ్‌, చరణ్‌ ఇలా అందరూ ఉన్నారు. ఒక్కోసారి నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు... ఎవరికి, ఎలా చెప్పాలి? అనేది తెలియదు. అప్పటికప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేను. ప్రెస్‌నోట్‌ ఇస్తే పూర్తిస్థాయిలో వెళుతుందో, లేదో? తెలియదు. ఇటువంటి ఇబ్బంది చాలాసార్లు ఎదుర్కొన్నా. నేను అనుకున్నవి చెప్పలేకపోతున్నానని ఒక్కోసారి అనిపించేది. అందుకని, నేనూ సోషల్‌ మీడియాలోకి వస్తే బాగుంటుందా అనుకుంటూ ఉండేవాణ్ణి. డిసెంబర్‌లో కరోనా రావడం, జనవరిలో ఉధృతి పెరగడంతో ‘ఇటువంటి సమయంలో హెచ్చరికలు గానీ, జాగ్రత్తలు గానీ చెప్పాల్సిన పరిస్థితి. సోషల్‌ మీడియాలోకి ఎంటరైతే బావుంటుంది’ అనుకున్నా. అభిమానులకు నేను ఎక్కడ ఉన్నాను? ఏంటి? అనేది ఫొటోలు పోస్ట్‌ చేయడం ద్వారా కనువిందు చేయగలను కదా! ఇన్ని ఆలోచించి ఉగాది రోజున ప్రారంభించా. యాక్టివ్‌గా ఉంటున్నా. ఎవరైనా, ఏదైనా మంచి పని చేస్తే ట్విట్టర్‌ ద్వారా అభినందిస్తున్నా. ధన్యవాదాలు చెబుతున్నా. సరైన సమయంలో మంచి వేదికను వాడుకుంటున్నా..’’ అని చిరు తన ఎంట్రీ వెనుక ఉన్న విషయాన్ని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement