Advertisement

Mega 154: సెట్‌లో చిరు.. ఉద్వేగభరితంగా బాబీ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి.. ‘తగ్గేదే.. లే’ అన్నట్లుగా స్పీడు పెంచుతున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు.. ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో చేస్తున్నారు. ‘గాడ్‌ఫాదర్’ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరోవైపు మెహర్ రమేష్‌తో చేస్తున్న ‘భోళాశంకర్’ చిత్రానికి పూజా కార్యక్రమాలు జరిపి.. సెట్స్‌పైకి వెళ్లిపోయారు. అలాగే బాబీ దర్శకత్వంలో మెగా154గా తెరకెక్కనున్న చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిపారు. ఇప్పుడీ చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లారు. గురువారం ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లుగా డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. తన ఎగ్జయిట్‌మెంట్‌ని తెలియజేస్తూ.. స్పాట్‌లోని పిక్‌ను కూడా పోస్ట్ చేశారు. ఈ చిత్ర ఓపెనింగ్ రోజే.. చిరుని మాస్ అవతార్‌లో చూపించి.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేలా చేసిన బాబీ.. ఫస్ట్ డే తన అనుభవం ఎలా ఉందో తెలుపుతూ.. మెగాస్టార్ బ్యాక్ కనిపించేలా పిక్‌ని పోస్ట్ చేశారు.


‘‘ఈ రోజు నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఒకేసారి ఉత్సాహం, ఉద్వేగం తన్నుకొస్తున్నాయి. మొదటి రోజు సెట్‌లోకి చిరంజీవిగారితో. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న.. ఈ కొత్త ప్రయాణం చాలా గొప్పగా మొదలైంది. మీ అందరి ఆశీస్సులు కావాలి..’’ అని బాబీ ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు.


Advertisement