Aug 1 2021 @ 21:01PM

Chiranjeevi: బాబీకి చిరు కానుక

దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) మెగాస్టార్‌ చిరంజీవికి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే! అభిమాన హీరోని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు బాబీ. చిరంజీవి హీరోగా ఆయనొక సినిమా చేయనున్నారు. ‘లూసిఫర్‌’ రీమేక్‌ తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఆదివారం బాబీ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిని కలిసి బ్లెస్సింగ్స్‌ తీసుకునార్నరు. బాబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి ఓ ప్రత్యేకమైన కలాన్ని బహుమతిగా ఇచ్చారు. అభిమాని స్థాయి నుంచి దర్శకుడిగా చిరంజీవి చేతుల మీదుగా గిఫ్ట్‌ తీసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు బాబీ. ఈ బహుమతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఆ గిఫ్ట్‌ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.