May 9 2021 @ 10:20AM

మ‌ద‌ర్స్ డే నాడు చిరు అలా.. మ‌హేశ్ ఇలా

ఆదివారం మ‌ద‌ర్స్ డే(మే 9). ఈ సంద‌ర్భంగా సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌పంచంలో త‌ల్లులంద‌రికీ శుభాకాంక్ష‌ల‌ను అంద‌చేస్తున్నారు. టాలీవుడ్ విష‌యానికి  మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ సోషల్ మీడియా వేదికగా మ‌ద‌ర్స్ డే విషెష్‌ను తెలియ‌జేశారు. త‌ల్లి అంజ‌నాదేవితో త‌న కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేసిన చిరంజీవి మదర్స్ డే విషెష్ తెలిపారు. ఇక మ‌హేశ్ విషయానికి వ‌స్తే.. మ‌హేశ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా మ‌ద‌ర్స్ డే విషెష్‌ను అందించారు. నిస్వార్ధ‌మైన ప్రేమ‌ను సెల‌బ్రేట్ చేసుకోవాలి. మా అమ్మతో పాటు ఈ ప్ర‌పంచంలో ఉన్న అమ్మ‌లంద‌రికీ మ‌ద‌ర్స్ డే శుభాకాక్ష‌లు అంటూ త‌ల్లి ఇందిరా దేవితో ఉన్న ఫొటోను స‌తీమ‌ణి న‌మ్ర‌త త‌న పిల్ల‌లు గౌత‌మ్, సితార‌ల‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఇన్‌స్టా లింక్‌ను ట్విట్ట‌ర్‌లోనూ షేర్ చేస్తూ మ‌ద‌ర్స్ డే విషెష్ తెలిపారు మ‌హేశ్‌.