Abn logo
Oct 25 2020 @ 16:23PM

నితీష్ ముక్త ప్రభుత్వం : బీజేపీ ఓటర్లకు చిరాగ్ పిలుపు

Kaakateeya

పాట్నా: 'నితీష్ ముక్త ప్రభుత్వానికి' లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిలుపునిచ్చారు. జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు మద్దతివ్వని బీజేపీ ఓటర్లంతా ఎల్‌జేపీకి ఓటు వేయాలని కోరారు. ఈమేపురు ఆదివారం ఉదయం చిరాగ్ ఓ ట్వీట్ చేశారు. ''బీహార్ ఫస్ట్.. బీహార్ ఫస్ట్.. అమలు కావాలంటే ఎల్‌జేపీకి ఓటు వేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. బీజేపీ లేని చోట్ల ఎల్‌జేపీకి ఓటేయండి. రాబోయే ప్రభుత్వం నితీష్ ముక్త ప్రభుత్వమే కావాలి'' అని చిరాగ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, జేడీయూ ఓటమికి చిరాగ్ పట్టుదలగా ఉన్నారు. తన దివంగత తండ్రి రామ్ విలాస్ పాశ్వాస్ పట్ల నితీష్ అనుచితంగా వ్యవహరించారని, చిన్న భాగస్వామ్య పార్టీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని చిరాగ్ గుర్రుమంటున్నారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement