Abn logo
May 28 2020 @ 03:36AM

నాబార్డు చైర్మన్‌గా ‘చింతల’ బాధ్యతల స్వీకరణ

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): నాబార్డు చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చింతల గోవిందరాజులు, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సూ ర్యకుమార్‌లతోపాటు మరో డీఎండీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాలోని బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వవిద్యార్థి గోవిం దరాజులు ఈ కీలక పదవిలో నియమితులవడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. తమ పూర్వ విద్యార్థి ఒకరు ఈ కీలక పదవిని చేపట్టడంపై బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. బెంగళూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో పలు బ్యాంకుల ఉన్నతాధికారులు నాబార్డు కొత్త చైర్మన్‌తో భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.  


Advertisement
Advertisement
Advertisement