Abn logo
Dec 2 2020 @ 00:06AM

వేదంతో విజ్ఞానం

చిన్నజీయర్‌ స్వామి

కోటబొమ్మాళి, డిసెంబరు 1: విశ్వానికి విజ్ఞానాన్ని అందించేది వేదమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామి అన్నారు. తర్లిపేట కొండపై వేద విశ్వవిద్యాలయ నిర్మాణానికి సంబంధించి మంగళవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌ స్వామి మాట్లాడుతూ వేద విద్య విశ్వజనితం చేయడానికే విశ్వవిద్యాలయం నిర్మిస్తున్నట్టు చెప్పారు. పిల్లలను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. టెక్కలి సీఐ నీలయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. 

Advertisement
Advertisement
Advertisement