Advertisement
Advertisement
Abn logo
Advertisement

కావలిలో రుద్ర సినిమా షూటింగ్‌

కావలిటౌన్‌, నవంబరు 27: కావలి పట్టణం మద్దూరుపాడులోని డీబీఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం రుద్ర సినిమా షూటింగ్‌ జరిగింది. గూడూరు శంకర్‌ పర్యవేక్షణలో చెరుకూరు శివకార్తికేయ ప్రొడక్షన్‌ నిర్మాణంలో శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శ్రీరామ్‌ కథానాయకుడుగా కల్యాణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్‌ షేకింగ్‌ శేషు, అప్పారావు, చిట్టిబాబు తదితరులు నటిస్తున్నారని శంకర్‌ తెలిపారు. మరో రెండురోజులు చిత్రీకరణ ఉంటుందని పేర్కొన్నారు. డీబీఎస్‌ కళాశాల కార్యదర్శి దామిశెట్టి బాలసురే్‌షబాబు సినిమా చిత్రీకరణకు అవసరమైన సహకారమందిస్తున్నారన్నారు. సినీ నటులను చూసేందుకు పట్టణ ప్రజలు తరలివచ్చి వారితో ఫొటోలు దిగారు. 


Advertisement
Advertisement