Abn logo
May 19 2020 @ 19:13PM

బాయ్‌ఫ్రెండ్‌పై యువతి రివెంజ్.. తట్టుకోలేక గగ్గోలు పెట్టిన ఇరుగుపొరుగు!

షాడాంగ్(చైనా): అమ్మాయిలూ, అబ్బాయిలూ ప్రేమలో పడటం, విడిపోవడం తరచూ జరిగేదే. అయితే అవతలి వారి చేతిలో మోసపోయామని తెలిస్తే మాత్రం మనసు గాయపడుతుంది. అలాంటి బాధనను అనుభవించిన ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌పై కొత్త తరహాలో రివెంజ్ తీర్చుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. జావ్ అనే యువతి షాడాంగ్ ప్రాంతంలో నివసిస్తుంటుంది. చైనీయుల ప్రేమికుల రోజుగా పిలిచే 520 డే రొజున ఆమెకు మరో స్నేహితురాలి ద్వారా తన బాయ్‌ఫ్రెండ్ చేస్తున్న మోసం గురించి తెలిసింది. మరో యువతితో అతడు సన్నిహితంగా మెలుగు తున్నాడని తెలిసి ఆమె బాధతో విలవిల్లడిపోయింది. కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఏడుస్తూ ఉండిపోయింది.


మరోవైపు.. జావ్ స్నేహితురాలు ఇదంతా గమనించింది. ‘నువ్వు ఇక్కడ ఏడూస్తూ కూర్చుంటే అతడు మాత్రం మరో అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడు చూడు’ అని చెప్పింది. దీంతో తిక్కరేగిన జావ్..అతడితో కూడా ఇదే విధంగా కన్నీళ్లు పెట్టించాలని భావించింది. వెంటనే ఓ ట్రక్కు నిండుగా ఉల్లిపాయలను తెప్చించి వాటిన తన బాయ్‌ఫ్రెండ్ ఇంట్లోలేని సమయంలో గుమ్మం ముందు కుమ్మరించమని పురమాయించింది.


‘నీతో కూడా కన్నీళ్లు పెట్టిస్తా’ అనే క్యాప్షన్ చీటీని కూడా అక్కడ వదిలిపెట్టిందట. ఇంటి కొచ్చి చూసుకున్న అతడికి దిమ్మతిరిగి పోయింది. ఉల్లిపాయల వాసన ఆ చుట్టుపక్కల అంతా వ్యాపించడంతో ఇరుగు పొరుగు వారూ గగ్గోలు పెట్టారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘భలే బుద్ధి చెప్పావ్’ అంటూ నెటిజన్లు సదరు యువతిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement