Abn logo
Sep 26 2020 @ 11:25AM

పిల్ల కోతి మృతి.. ఊపిరి పోసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన తల్లి కోతి..

Kaakateeya

చెన్నై : ఏర్కాడు అటవీ మార్గంలో ఓ వాహనం ఢీకొని చిన్న కోతి మృతి చెందింది. అచేతనంగా పడిన చిన్న కోతిని దాని తల్లి తట్టి లేపుతూ, నోట్లో ఊదుతూ చేసిన యత్నాలను చూసిన అందరి కళ్లు చెమర్చాయి. ఏర్కాటు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కోతులున్నాయి. అక్కడి రోడ్డు మార్గం దాటేందుకు వెళ్తున్న పలు కోతులు వాహనాల కింద పడి మృతి చెందుతుంటాయి. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం ఓ వాహనం కింద పడి ఓ చిన్న కోతి మృతి చెందింది. దాని వెనుకాల వస్తున్న తల్లి కోతి పడిపోయిన చిన్న కోతిని లేపేందుకు నానా తంటాలు పడింది. దానిని తట్టడంతో పాటు, నోట్లో గాలి ఊదుతూ లేపేందుకు యత్నించింది. అంతలో ఈ దృశ్యాలను ఆ మార్గంగా వెళుతున్న వాహనచోదకులు చేరుకోవడంతో, కళేబరాన్ని చంకలో పెట్టుకుని తల్లి కోతి అడవుల్లోకి వెళ్లిపోయింది.

Advertisement
Advertisement
Advertisement