Abn logo
Aug 7 2020 @ 00:45AM

మేడిపల్లిలో బాల్య వివాహం అడ్డగింత

యాచారం : యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో పోలీసులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన ఓ యువకుడితో గురువారం తెల్లవారుజామున వివాహం జరిపేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో తెల్లవారుజామున రెండున్నర గంటలకే మేడిపల్లికి చేరుకొని వివాహాన్ని ఆపారు. బాలిక తల్లితండ్రులు, వరుడి కుటుంబీకులకు సైతం పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరో మూడేళ్ల వరకు బాలిక వివాహం చేయరాదని ఆదేశించారు. రహస్యంగా పెళ్లి చేసినా తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Advertisement
Advertisement