Abn logo
Sep 27 2020 @ 18:11PM

కారు ఢీకొని చిన్నారి మృతి

పార్కింగ్ నుంచి కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం


నిజామాబాద్: కంటేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్‌మెంట్స్‌‌లో విషాద ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్స్‌‌లో పార్కింగ్ స్థలం నుంచి కారును వెనక్కి తీస్తుండగా ఓ చిన్నారి కారు కింద పడి మృతి చెందింది. పార్కింగ్ స్థలం నుంచి ఓ యువకుడు అజాగ్రత్తగా కారును వెనక్కి తీయగా అక్కడ ఆడుకుంటున్న వాచ్‌మన్ బోని కూతురు మనస్వి తలపై నుంచి కారు వెళ్లింది. దీంతో ఏడాదిన్నర వయస్సు గల మనస్విని అక్కడికక్కడే మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Advertisement
Advertisement
Advertisement