Abn logo
May 17 2020 @ 01:33AM

సరఫరా తగ్గటంతోనే చికెన్‌ ధరలకు రెక్కలు

  • వచ్చే నెల 15 తర్వాత తగ్గే అవకాశం 
  • వెంకటేశ్వర హేచరీస్‌ జీఎం బాలసుబ్రమణియన్‌ 

హైదరాబాద్‌: మార్కెట్లో ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలు లేకపోవటంతోనే చికెన్‌ ధరలు గణనీయంగా పెరిగాయని వెంకటేశ్వర  హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. గడచిన కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందటం, ఇదే సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించటం తో మార్కెట్లలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని తెలిపింది.  మరోవైపు చికెన్‌, గుడ్లు తింటే వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దుష్ప్రచారంతో పౌలీ్ట్ర రైతులు ఆర్థికంగా చితికిపోయారని పేర్కొంది. దీంతో భవిష్యత్‌ డిమాండ్‌ గురించిన ఆందోళనతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కొత్తగా కోళ్లను పెంచకపోవటంతో సరఫరాలు తగ్గి చికెన్‌ ధరలు పెరిగాయని వెంకటేశ్వర హేచరీస్‌ జనరల్‌ మేనేజర్‌  బాలసుబ్రమణియన్‌  వెల్లడించారు.


లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవటంతో కోళ్ల దాణా, బ్రాయిలర్‌ కోడి పిల్లల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని దీంతో మే నెలలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో చికెన్‌, గుడ్ల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించటంతో గడచిన నెల రోజులుగా  అమ్మకాలు భారీగా పెరిగిపోయాయని తెలిపారు. లాక్‌డౌన్‌ కంటే ముందు రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు 4.2 కోట్ల కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తుండగా ప్రస్తుతం ఈ సంఖ్య కేవలం 2.8 కోట్లుగా ఉందన్నారు. 


రోజుకు 8 లక్షల కిలోల చికెన్‌ విక్రయం: లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి మూతపడటంతో కేవలం గృహ వినియోగదారులు మాత్రమే చికెన్‌ ఉపయోస్తున్నారని సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. రెస్టారెంట్లు, హోట ళ్లు తెరవకపోవటంతో చాలా మంది పౌలీ్ట్ర రైతులు కోళ్లను పెంచేందుకు సుముఖత చూపించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో  సాధారణ రోజుల్లో 7.5 లక్షల నుంచి 8 లక్షల కిలోల వరకు చికెన్‌ అమ్మకాలు ఉంటుండగా.. ఒక్క ఆదివారం మాత్రమే 24 లక్షల కిలోల వరకు విక్రయాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో పరిస్థితులు చక్కబడుతున్నాయని, దీంతో త్వరలోనే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలు ఉండే అవకాశం ఉందన్నా రు. జూన్‌ 15 తర్వాత చికెన్‌ ధరలు కొద్దిగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు సుబ్రమణియన్‌ తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement