Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 12 2022 @ 07:49AM

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు

రాయపూర్ : ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాయపూర్ నగరానికి చెందిన మిథిలేష్ మాఝీ అలియాస్ పప్పూ అనే యువకుడు 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర రాయపూర్ విధానసభ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మిథిలేష్ ను అరెస్టు చేశారు. కోర్టు విచారణలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని తేలడంతో దోషి అయిన మిథిలేష్ కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సుభ్రా పచౌరీ తీర్పు చెప్పారు. దోషి అయిన మిథిలేష్ కు 56 వేల రూపాయల జరిమానాను కూడా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.


Advertisement
Advertisement