Abn logo
May 9 2021 @ 16:23PM

ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అనుమతి

ఛత్తీస్‌గఢ్: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించాయి. కరోనా ఉధృతంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, కేరళ రాత్రివేల కర్ఫ్యూతోపాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించాయి. దీంతో దుకాణాలు, బార్లు, వైన్ షాపులు, పబ్‌లు బంద్ అయ్యాయి. మందుబాబులు పెగ్గు కోసం నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇలాంటివారి కోసం లాక్ డౌన్ విధించిన అనేక రాష్ట్రాలు మందు బాటిళ్లను ఇంటింటింకి డోర్ డెలివరీ చేస్తున్నాయి.


ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఆన్ లైన్ లిక్కర్ డెలివరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఓ యాప్‌ను తయారు చేసింది. ‘సీఎస్ఎంసీఎల్’ యాప్‌లో వివరాలు పూర్తి చేస్తే ఇంటివద్దకే లిక్కర్‌ను సరఫరా చేస్తారు.

Advertisement