Abn logo
Sep 6 2020 @ 03:47AM

తాండూరులో మెగా సీడ్‌ పార్కు

Kaakateeya















 ‘దిశ’ సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో మెగా సీడ్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు వెంటనే డీపీఆర్‌ తయారు చేసి అందజేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం జడ్పీహాల్‌లో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.  జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, కలెక్టర్‌ పౌసుమిబసు, సభ్యులతో కలిసి ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపై చర్చించి మాట్లాడారు. దేశంలో మూడుచోట్ల మాత్రమే మెగా సీడ్‌ పార్కులు, ఎస్‌ఈజడ్‌లు ఉన్నాయని, తాండూరులో కంది పరిశోధనా కేంద్రం సమీపంలో మెగా సీడ్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దీని కోసం ఆర్థిక సహాయం అందించేందుకు నాబార్డ్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. డీపీఆర్‌ రూపొందించేందుకు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల వ్యవసాయ శాఖ అఽఽధికారులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకుని ఈనెల 14లోగా తనకు అందజేయాలని సూచించారు.


మెగా సీడ్‌ పార్క్‌ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిలతో చర్చిస్తామని, అనంతరం వారి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వీలైతే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో చర్చించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. మెగా సీడ్‌ పార్క్‌ ఏర్పాటుకు వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల స్థలం అవసరమవుతుందన్నారు. భారత్‌ దర్శన్‌ కింద అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పచ్చదనం పది శాతం పెరిగిందని, దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరగనున్నాయని చెప్పారు. పంటలకు బీమా కల్పించేందుకు ప్రయోగాత్మకంగా జిల్లాలో ఓ మండలాన్ని ఎంపిక చేసి అమలు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ పౌసుమి బసు జిల్లాలో ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ కింద జిల్లా కూరగాయల సాగుకు ఎంపికైందని తెలిపారు. సమావేశంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌, సీఈవో ఉష, డీఆర్‌డీవో కృష్ణన్‌, అఽధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. 

Advertisement
Advertisement