Abn logo
Sep 27 2020 @ 01:00AM

మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు

Kaakateeya

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


శంకర్‌పల్లి: మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు అయినట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శనివారం శంకర్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రూర్బన్‌ నిధుల కింద రూ.రెండు కోట్లు మంజూరైయినట్టు తెలిపారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల గదుల మరమ్మతులు, వంట గదులు, ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తామన్నారు. శంకర్‌పల్లిలోని ప్రధాన చౌరస్తా నుంచి ఫత్తేపురం ప్లైఓవర్‌ వరకు నాలుగు లేన్ల రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అఽధికారులను, రోడ్ల పక్కనున్న విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని ట్రాన్స్‌కో అఽధికారులను ఆదేశించారు. అనంతరం కార్మికులకు పారిశుధ్య కిట్లు అందించారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, కమిషనర్‌ జైత్రాంనాయక్‌, ఆ శాఖ అఽధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement