Abn logo
Sep 13 2021 @ 15:21PM

సముద్రంలో మునిగిన చెన్నై బోటు

నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం సమీపం సముద్రంలో ప్రమాదవశాత్తు చెన్నై బోటు మునిగిపోయింది. బోటులో ఎనిమిది మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి చెందినవారు. వలలో చిక్కుకుని మత్స్యకారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చిక్కుకున్నవారిని మరో బోటులో ఉన్న మత్స్యకారులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. వారిని సురక్షితంగా కృష్ణపట్నంకి తరలించారు. సుమారు రూ.40 లక్షలకి పైగా ఆస్థి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.