Abn logo
Sep 26 2021 @ 22:17PM

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

తమిళనాడు: చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి విదేశీ బంగారాన్ని అధికారులు గుర్తించారు. దుబాయ్ ప్రయాణీకుల వద్ద రూ. 67 లక్షల విలువ చేసే 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులు అక్రమ బంగారం రవాణా కట్టడి చేస్తున్నా…..ప్రయాణీకుల రూపంలో స్మగ్లర్లు బంగారాన్ని వివిధ మార్గాల ద్వారా తరలుస్తూనే ఉన్నారు. ముగ్గురు కేటుగాళ్లు బంగారాన్ని పేస్టుగా చేసి…..పేస్టుగా చేసిన బంగారాన్ని క్యాపసల్స్‌లో నింపి మలద్వారంలో దాచి తరలించే యత్నం చేశారు. దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్నారు. నడవడిక లో అనుమానం రావడంతో వారిని అదుపు‌లోకి తీసుకున్నారు. తమదైన స్టైల్‌లో విచారణ చేయగా అక్రమ బంగారం బయట పడింది. బంగారం సీజ్ చేసి ముగ్గురు ప్రయాణీకుల పై కస్టమ్స్1962 యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.