Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 25 2021 @ 11:32AM

Cheating‌ caseలో ‘సాబూ కార్స్‌’ డైరెక్టర్‌పై కేసు

హైదరాబాద్/మారేడుపల్లి: సాబూ కార్స్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రశాంత్‌సాబూపై కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బుధవారం ఆయనను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సీఐ రవీందర్‌ తెలిపిన కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ సిఖ్‌విలేజ్‌ నివసించే కె.వీరేందర్‌రెడ్డి కూరా మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జూలై నుంచి రెండు కార్లకు సంబంధించిన రుణాలు కట్టడం లేదని, ఏఎ్‌సరావు నగర్‌కు చెందిన సుందరం ఫైనాన్స్‌ కంపెనీ తన ఇంటికి వచ్చారన్నారు. దీంతో షాక్‌కు గురైన అతను తాను ఎటువంటి కారు లోన్లు తీసుకోలేదని, అతను సదరు ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. మారేడుపల్లికి ప్రశాంత్‌ సాబూ అనే వ్యాపారి ‘మీ గ్యారంటీ సంతకంతో రెండు కార్ల లోన్లు రూ.40లక్షలు తీసుకున్నాడు’ అని సిబ్బంది తెలిపారు. వీరేందర్‌రెడ్డి సంతకాలతో కూడిన లోన్‌ డాక్యుమెంట్లను చూపించారు. ఈ విషయంలో తాను మోసపోయినట్లు గ్రహించిన వీరేందర్‌రెడ్డి ఈ నెల 16న కార్ఖానా పోలీ్‌సస్టేషన్‌లో ప్రశాంత్‌ సాబూపై ఫిర్యాదు చేశారు. కార్ఖాన పోలీసులు ప్రశాంత్‌సాబూను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement