Advertisement

అంకుల్ అంటూ గోవిందా ట్రోల్ చేసిన నెటిజన్లు.. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇదే చేశారంటూ కౌంటర్

రాజా బాబు, కూలి నెం 1, హీరోన నెం 1, దుల్హే రాజాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు గోవిందా.. చివరి సారిగా 2019లో వచ్చిన ‘రంగ్లీలా రాజా’తో సినిమాలో వెండితెరపై కనిపించాడు. అనంతరం గత నెలలో తన మ్యూజిక్ వీడియో ‘టిప్ టిప్ బార్సా పానీ’తో అభిమానులను పలకరించాడు ఈ నటుడు. అది మంచి రెస్సాన్స్ అందుకొని యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 


తాజాగా మరో సాంగ్‌ ప్రొమోని సోషల్ మీడియాలో విడుదల చేశాడు ఈ యాక్టర్. ‘చష్మా చదా కే’ అనే ఈ మ్యూజిక్ వీడియోలో గోవిందాకి జోడిగా షానయా కౌర్ నటించింది. ఈ నెల 6న పూర్తి సాంగ్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపాడు. ఎంతో బావుంది పూర్తి పాటని త్వరగా రిలీజ్ చేయండంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడాని ఎత్తి చూపుతూ ట్రోలింగ్ చేశారు. 


కొందరు ‘అంకుల్’ అంటూ కామెంట్స్ పెట్టగా.. దానికి ఓ నెటిజన్ మాత్రం గోవిందాని ఢిపెండ్ చేస్తూ.. ‘షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా ఇలాగే తమ వయసుకంటే ఎంతో తక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్లతో నటించారు. వాళ్లైమైన కుర్రాళ్ల?’ అంటూ రిప్లై ఇచ్చాడు.


Advertisement

Bollywoodమరిన్ని...