Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేడుకలకు హాజరైన భక్తులు

- భక్తి శ్రద్ధలతో నందికోళ్ల సేవ, రథోత్సవం

- పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

గద్వాల టౌన్‌, డిసెంబరు 2 : పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయంలో గురువారం వీర శైవ సంఘం ఆధ్వర్యంలో భద్రకాళీ వీరభద్ర స్వామి వార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కృష్ణానది నుంచి తెచ్చిన నదీ జలాలతో రుద్రాభిషేకం చేశారు. ఉదయం 11.43గంటల సమయంలో జే వీరేష్‌స్వామి, ఆర్‌ కార్తికేయ స్వామి, జె పవన్‌ స్వామిల ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించా రు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులను పట్టణంలో ఊరేగించారు. ఈ సందర్భంగా వీర శైవులు నందికోళ్ల సేవను కన్నుల పండువగా చే శారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంపీ రమేష్‌బాబు, విజయ్‌ కుమార్‌, కోశాధికారి ప్రభులింగం స్వామి, బసవ రాజు, సాంబ శివయ్య, సుధాకర్‌, మహిళా సమాజం అధ్యక్ష, కార్యదర్శులు ఈరమ్మ, అరుణజ్యోతి, ఎంజీ గౌరి, చంద్రకళ, ప్రసన్న, లక్ష్మి, యువజన సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement