Oct 23 2021 @ 09:21AM

హిస్టారిక్ ఫీట్‌పై చరణ్ ట్వీట్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హిస్టారిక్ ఫీట్‌పై తాజాగా ట్వీట్ ద్వారా తన స్పందనను తెలిపారు. "భారతదేశం 100 కోట్ల వాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని 'వాక్సినేషన్ సెంచరీ' అనే హిస్టారికల్ ఫీట్‌ను నమోదు చేసింది. ఈ ఘనత సాధించడానికి అహర్నిశలు పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మెడికల్ టీమ్మ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞ్యతలు తెలియజేస్తున్నాను"..అని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇండియా వారిపై ప్రశంసలు కురిపించారు. కాగా ఇంతకముందు ఇదే చారిత్రాత్మిక ఘటనపై చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన స్పందనను తెలియజేశారు.