Abn logo
Mar 28 2020 @ 09:15AM

చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా వ‌ర్క్ జ‌రుగుతుందా?

ప్ర‌స్తుతం ‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాతో బిజీగా ఉన్న మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా ఎవ‌రితో ఉంటుంద‌నే దానిపై సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ సినిమా ఉంటుంద‌ని గ‌ట్టిగా వార్త‌లు వ‌చ్చాయి కూడా. అయితే తాజాగా క‌మ‌ర్షియ‌ల్ సినిమా డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ ప‌నిచేయబోతున్నాడ‌ని అంటున్నారు. అనీల్ చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో చ‌ర‌ణ్ క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఇప్పుడు అనీల్ ఆ ప‌నిలోనే ఉన్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రాజ‌మౌళి సినిమా పూర్తి కాగానే చ‌ర‌ణ్ త‌న నెక్ట్స్ మూవీని ట్రాక్ ఎక్కించేస్తాడ‌ని అంటున్నారు. డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని టాక్‌.

Advertisement
Advertisement
Advertisement