Abn logo
Jun 19 2021 @ 21:24PM

దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు

విజయవాడ: రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షల సడలింపుతో ఆలయాలలో దర్శన వేళల్లో మార్పులు జరిగాయి. 21వ తేదీ నుంచి బెజవాడ  కనక దుర్గమ్మ దర్శన వేళల్లో దేవాదాయ అధికారులు మార్పులు చేశారు. ప్రస్తుతం  ఉదయం 06.30 గం.ల నుంచి మ.01.30 గంల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. సోమవారం నుంచి ఉ. 6.30am నుంచి 5.30pm వరకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు దుర్గగుడి‌ ఛైర్మన్ పైలా సోమినాయడు, ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.