Advertisement
Advertisement
Abn logo
Advertisement

Chandrayangutta: మర్డర్‌ వెనుక మూఢనమ్మకం

బావమరిదిని చంపించిన బావ

నలుగురు నిందితుల అరెస్ట్‌  


హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: మూఢనమ్మకం ఓ హత్యకు కారణమైంది. ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌ కేసు వివరాలు వెల్లడించారు. జహనుమా ఫహీంబాగ్‌కు చెందిన  మహ్మద్‌ ఆరీఫ్‌ అలియాస్‌ షోయబ్‌ (32), హుసేనీఆలం పోలీ్‌సస్టేషన్‌లో హోంగార్డుగా పనిచేసే మహ్మద్‌ సమీ మొహియుద్దీన్‌ బావ బామ్మర్దులు. ఆరీ్‌ఫకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో ఆమె తల్లిండ్రులు ముంబైలోని ఓ బాబాను కలిశారు. కాబోయే భర్త దగ్గరి బంధువులు చేతబడి చేయిస్తున్నారని సదరు బాబా చెప్పాడు. వారు అదే విషయాన్ని ఆరీ్‌ఫకు చెప్పారు.  తన బావ మహ్మద్‌ సమీ మొహియుద్దీన్‌ ఇదంతా చేయిస్తున్నాడని అనుమానించిన ఆరీఫ్‌ అతడి ఇంటికి వెళ్లి నిలదీశాడు.


ఆమె వైద్యం ఖర్చులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో మహ్మద్‌ సమీ రూ. 50వేలు ఇచ్చాడు. మళ్లీ.. మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండగా, ఆరీ్‌ఫను చంపాలని సమీ మొహియుద్దీన్‌ పథకం వేశాడు. తన సోదరుడు మహ్మద్‌ అమ్జద్‌ మొహియుద్దీన్‌ అతని స్నేహితులు మహ్మద్‌ అలీ (21), అచ్చిరెడ్డినగర్‌కు చెందిన ఆమెర్‌ మహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ కాబూతర్‌(26) లకు డబ్బులు ఇచ్చి.. ఆరీ్‌ఫను చంపేయాలని చెప్పాడు. దీంతో వారు శనివారం రాత్రి ఫహీంబాగ్‌కు వెళ్లారు. ఆరీఫ్‌ ఇంటి ముందు నిలబడి ఫోన్‌లో మాట్లాడుతుండగా కారం చల్లి వెంట తెచ్చుకున్న గొడ్డలి, కత్తితో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆరి్‌ఫను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ చనిపోయాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమీ మొహియుద్దీన్‌తో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement