Abn logo
Mar 26 2020 @ 03:27AM

ఉగాది.. చిగురించే ఆశలకు సంకేతం: చంద్రబాబు

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు లోగిళ్లలో వెల్లివిరిసే సంస్కృతి, సంప్రదాయాలకు.. కొత్త చిగురులు తొడిగే ప్రకృతి తోడై.. అత్యంత శోభాయమానంగా.. రానున్న శుభాలకు సంకేతంగా ఆరంభమయ్యే నూతన సంవత్సరమే ఉగాది. అలాంటి ఉగాది సంబర వేళ.. కరోనా కలకలంతో ఎక్కడ చూసినా స్తబ్దత నెలకొంది.. మరేం ఫర్వాలేదు. ఉగాది అంటేనే చిగురించే ఆశలకు సంకేతం. ఈ ఉగాది నుంచి కరోనా మహమ్మారి కనుమరుగవ్వాలని ఆశిద్దాం. అందుకోసం ఉగాది వేడుకలను మన ఇంటి గడప వరకే పరిమితం చేసుకుందాం. ప్రజలందరికీ శార్వరీ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement