Abn logo
Mar 6 2021 @ 12:04PM

విశాఖకు పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలి: చంద్రబాబు

విశాఖ: నగరానికి పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాత గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడంతా వెనుకబడిన వర్గానికి చెందినవారు ఉన్నారని, ఏ2కు ఇక్కడ ఏంపనని ప్రశ్నించారు. ఇంకా బూతుల మంత్రి ఒకరు, హావాలా మంత్రి ఒకరు, కొబ్బరికాయల మంత్రి ఒకరని విమర్శించారు. మోసాలు చేయడంలో సీఎం జగన్ దిట్టని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఈ అరాచక పాలనను అంతమొందించి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందామన్నారు. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలన్నారు. అవినీతి, అన్యాయంపై గళమెత్తాలని, అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలని.. బొబ్బిలి పులిలా గాండ్రించాలని, మహిళలు ఝూన్సీ లక్ష్మీబాయిలా పోరాడాలని పిలుపు ఇచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement