Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. బాధితులను ఆదుకోవాలంటూ చంద్రబాబు సీఎస్‌కు లేఖ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తుపాను కారణంగా నష్టపోయిన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజలను, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. వరద పరివాహక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సహాయం అందడం లేదన్నారు.


జాతీయ ప్రకృతి వైపరీత్యాల సంస్థ మార్గదర్శకాల మేరకు ప్రతి ఒక్కరికి సాయం అందించాలని చంద్రబాబు కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇళ్లు కోల్పోయిన వారికి గృహ నిర్మాణం చేపట్టాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహాయం కొనసాగాలన్నారు. పంట నష్ట పరిహారాన్ని కూడా పెంచాలని చంద్రబాబు లేక ద్వారా విజ్ఞప్తి చేశారు.


Advertisement
Advertisement