Abn logo
Dec 2 2020 @ 14:52PM

అసైన్డ్ భూముల చట్టానికి జగన్ ప్రభుత్వం తూట్లు..: చంద్రబాబు

అమరావతి: అసైన్డ్ భూముల చట్టానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో 19,450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం మరో 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవటం రాష్ట్రంపై పెనుభారం మోపడమేనని అన్నారు. ముఖ్యమైన బిల్లులపై అసెంబ్లీలో మాట్లాడేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం మైక్ ఇవ్వడంలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement