Abn logo
Apr 6 2020 @ 18:21PM

వెయ్యితో అధికారపార్టీ ఉల్లంఘన: చంద్రబాబు

అమరావతి: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెల్లరేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్‌తోపాటు రూ. వెయ్యి ఇస్తాని ప్రకటన చేసి.. నేతలు ఇంటింటికి వెళ్లి డబ్బులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కరోనా వైరస్ ఉండగా ఇలా నేతలు ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇవ్వడం, గుంపులు గుంపులుగా వెల్లడంపై ఆయన మండిపడ్డారు. 


ఇప్పుడు ఇనాగరేషన్లు చేయడం, మరోవైపు ఉచితంగా ఇసుక, మట్టి ట్రాన్స్ పోర్టు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రంలో మద్యం బంద్ అయితే.. బజారులో దొరుకుతుందని అన్నారు. ఈ విషయాలన్నింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్వార్థం కోసం పనిచేస్తే చాలా సమస్యలు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement
Advertisement