Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండపల్లి చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: కొండపల్లి చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి... ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసీ, డీజీపీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికారపార్టీ వారినే చైర్మన్‌గా నియమించుకోవాలన్నారు. భయబ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని వ్యక్తులు మారణాయుధాలతో హల్‌ చల్ చేస్తున్నా... అక్కడే ఉన్న  పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని, తమ సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దన్నారు. ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు అన్నారు.

Advertisement
Advertisement