Abn logo
Mar 6 2021 @ 12:59PM

వైసీపీకి ఓటు వేస్తే.. రౌడీయిజానికి లైసెన్స్ ఇచ్చినట్టే: చంద్రబాబు

విశాఖ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాత గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లకు ఓట్లు వేస్తే రౌడీయిజానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని అన్నారు. రౌడీలు, గూండాలు, నేరస్తులు పెట్రేగిపోతారని, దాడులకు తెగబడతారని.. అలాంటప్పుడు మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరని చంద్రబాబు అన్నారు.


వైసీపీ అభ్యర్ధులందరూ నేర చరిత్ర కలిగి ఉన్నారని, నేర చరిత్ర లేకపోతే జగన్ వారికి టిక్కెట్లు ఇవ్వరని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఓట్లు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు అంగీకరించినట్లు అవుతుందన్నారు. అలాగే విశాఖపట్టణానికి పట్టిన ఏ2 శనిని (విజయసాయిరెడ్డి) వదిలించుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement