Abn logo
Mar 6 2021 @ 14:05PM

అచ్చెన్నపై కేసుపెడితే.. జగన్ జీవితాంతం జైల్లోనే ఉండాలి: చంద్రబాబు

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాత గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడుపై కేసు పెట్టారని.. ఆయనపై కేసు పెడితే జగన్ చేసిన అన్యాయానికి, అవినీతికి జీవితాంతం జైల్లో ఉండాలని, బయట ఉండే అర్హత లేదని అన్నారు. విశాఖ మేయర్‌గా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై కూడా కేసు పెడతారని, ఇది అరాచకానికి పరాకాష్టని అన్నారు. ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విశాఖకు ఒక శని పట్టిందని, అది ఏ2 విజయసాయిరెడ్డని, ఆ శనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని చంద్రబాబు అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement