Abn logo
Dec 2 2020 @ 14:06PM

పోలవరంపై అనుమానాలు: చంద్రబాబు

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం తీరు చూస్తుంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ పోలవరంపై టెండర్లను తన హయాంలో పిలవలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు మొదలయ్యాయన్నారు.


2013 ముగిసే నాటికి టెండర్లు ఇచ్చారని, టెండర్లను మేము పిలవలేదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. 7 ముంపు మండలాలు తీసుకురాకపోయి ఉంటే అసలు ప్రాజెక్టు ఉండేది కాదన్నారు. పోలవరం టెండర్లను వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రీక్లోజర్ చేశారని, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి వచ్చే వరకు ఫైనల్‌ చేయలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని కావాలనే వివాదంలోకి నెడుతోందన్నారు. ‘మీరు తవ్విన గోతిలో మీరే పడే పరిస్థితి వచ్చిందని’ చంద్రబాబు అన్నారు.

Advertisement
Advertisement
Advertisement