Abn logo
Aug 3 2021 @ 22:33PM

ఆ బోర్డులు చూసైనా మారండి: లోకేశ్

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌గ‌న్‌ స‌ర్కారు పెంచిన ప‌న్నుల‌తో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేశాయని ఆయన విమర్శించారు. సౌత్‌లోనే పెట్రోల్ అతి ఎక్కువ‌గా ఉంటే చంద్ర‌బాబుపై పడి ఏడుస్తున్నారని అని ఎద్దేవా చేశారు. ఇంధ‌న‌ ధ‌ర‌ల భారం ప్రజలపై పడకూడదని 2018లో పెట్రోల్,డీజిల్‌పై అదనపు వ్యాట్‌ని రూ.4 నుంచి రూ.2కి తగ్గించిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 31 శాతం వ్యాట్+లీటరుకి రూ.4 అదనపు వ్యాట్+లీటరుకి 1రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకంవేసి లీటర్ పెట్రోల్‌కి పన్నుల రూపంలో రూ.30 భారం సామాన్యులపై మోపిన చ‌రిత్ర జ‌గ‌న్‌దని లోకేశ్ విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు  ఏ రేంజులో ఉన్నాయో తెలుసుకోవాలంటే స‌రిహ‌ద్దులోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ బంకుల్లో బోర్డులు చూడాలన్నారు. ఏపీ కంటే త‌క్కువ ఉన్న ధరల బోర్డులు చూసైనా చంద్ర‌బాబుపై ఏడుపు ఆపండని ప్రభుత్వ సలహాదారు సజ్జలను ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.