Abn logo
Jul 10 2020 @ 19:12PM

ప్రముఖ టీవీ నటికి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం..!

సిడ్నీ: ప్రముఖ టీవీ నటి చాందినీ భగ్వనానికి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తూ.. చర్చనీయాంశం అయింది. చాందినీ భగ్వనాని వీడియోలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మెల్‌బోర్న్ నుంచి ఓ ప్రాంతానికి వెళ్లడానికి చాందినీ భగ్వనాని.. ఓ బస్సు ఎక్కారు. తనకు అక్కడ బస్సుల్లో తిరిగిన అనుభవం లేకపోవడం, గూగుల్ మ్యాప్‌లో చూపిస్తున్న రూట్లో బసు వెళ్లకపోవడంతో ఆమె కంగారు పడ్డారు. దీంతో డ్రైవర్ వద్దకు వెళ్లి.. బస్ సరైన గమ్య స్థానానికే వెళ్తుందా అని ప్రశ్నించారు. అయితే ఆ డ్రైవర్ ఆమె ప్రశ్నకు బదులివ్వలేదు. ఇదే సమయంలో ఇతర ప్రయాణికులు అడిగిన ప్రశ్నలకు సదరు డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. దీంతో తన ప్రశ్న డ్రైవర్‌కు వినిపించలేదమో అని భావించిన చాందినీ భగ్వనాని.. అతడ్ని తిరిగి ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన డ్రైవర్.. ఇక్కడి నుంచి వెళ్లిపోండంటూ భారతీయులను ఉద్దేశించి బూతులు మాట్లాడాడు. దీంతో షాక్‌కు గురైన ఆమె.. బస్ నుంచి దిగిపోయి.. తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ.. ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. కాగా.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆమె ఆస్ట్రేలియాలో చిక్కుకున్నారు.  జాత్యహంకారం ఇంకా ఉందనడానికి తనకు జరిగిన అనుభవమే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. 


Advertisement
Advertisement
Advertisement