Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాణక్య నీతి: బంగారు గ్లాసులోని నీరు.. మట్టి గ్లాసులోని నీరు.. ఏది గొప్పది?.. మనిషికి ఏది అవసరం?

ఆచార్య చాణక్య పలు సమస్యలకు తెలివైన సలహాలు అందిస్తూ వాటికి పరిష్కారం సూచిస్తుంటారు. ఒకరోజు రాజు చంద్రగుప్త మౌర్య, మహామంత్రి చాణక్య, మహారాణి ఏదో విషయమై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రగుప్త.. చాణక్యునితో.. ‘మీరు నల్లగా ఉన్నారు. దూరం నుంచి కురూపిగా కనిపిస్తారు. అయితే మీలో లెక్కకుమించిన సద్గుణాలు ఉన్నాయి. అందుకే మీరు అందంగా కూడా ఉంటే మరింత బాగుండేవారు. భగవంతుడు ఆ విషయంలో మీపై చిన్నచూపు చూశాడు’  అని అన్నారు. 

వెంటనే చాణక్యుడు సమాధానిమస్తూ.. ‘మహారాజా.. రూపమనేది అందరినీ మోహింపజేస్తుంది. అయితే ఇది క్షణికం. దీనికి గొప్పతనమేమీ లేదు’ అని అన్నారు. వెంటనే రాజు మాట్లాడుతూ.. మీరు అందంగా లేరని అలా వాదిస్తున్నరంటూ, అందం కన్నా గుణం గొప్పదని చెప్పే ఒక ఉదాహరణ మీ దగ్గర ఉంటే చెప్పండి’ అని అడిగాడు. దీనికి చాణక్య.. రాజుతో ‘ ఈ నీటిని తాగండి’ అంటూ రెండు గ్లాసులతో నీటిని అందించాడు.. వీటిలో మొదటి గ్లాసు బంగారంతో చేసినది. రెండవది మట్టి గ్లాసు. ఈ రెండింటిలో దేనిలోని నీరు బాగుందని అడిగాడు. దీనికి రాజు సమాధానమిస్తూ,, మట్టి గ్లాసులోని నీరు రుచికరంగా ఉందని అన్నాడు. వెంటనే చాణక్యుడు ‘మట్టి గ్లాసులోని నీరే మీకు తృప్తి నిచ్చింది. బంగారు గ్లాసు కంటికి అందంగా కనిపించినా, మట్టి గ్లాసులోని నీరే మీకు గొప్పగా అనిపించింది. అంటే గుణం కారణంగానే మీకు సంతృప్తి కలిగింది కానీ అందం వలన కాదు. ఇదే గుణానికున్న గొప్పతనం అని చాణక్య రాజుకు తెలియజేశాడు. దీని ద్వారా ఆచార్య చాణక్య మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యతనిస్తూ, గుణాలకు విలువ నివ్వకపోవడం వలన చాలా కోల్పోతున్నామని, అందుకే ముందుగా గుణాలను చూడాలని చాణక్య సూచించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement