Abn logo
Oct 21 2021 @ 22:18PM

‘చలో హైదరాబాద్‌’జయప్రదం చేయండి

నాయుడుపేట, అక్టోబరు 21 : చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి గోవిందువాసు మాదిగ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీలోని ఆలయం వద్ద గురువారం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల 24న  హైదరాబాద్‌లో నిర్వహించబోవు మాదిగ ఉద్యోగుల 5వ జాతీ య మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. నారాయణ, సురేష్‌, హేమంత్‌, చంద్ర, వెంకటేష్‌, శీను తదితరులు పాల్గొన్నారు.