లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ప్రయాణాలకు అనుమతి లభించడంతో విహారయాత్రలకు వెళుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది సినీ ప్రముఖులు దుబాయ్, మాల్దీవులు వంటి ప్రదేశాలకు వెకేషన్‌కు వెళ్లారు.
అక్కినేని నాగచైతన్య, సమంత కూడా మాల్దీవుల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య బర్త్‌డే సెలబ్రేషన్స్ అక్కడే జరిగాయి. అక్కడి ఫొటోలను సమంత సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. దాదాపు వారం రోజుల పాటు అక్కడి రిసార్ట్స్‌లో ఎంజాయ్ చేసిన చై-సామ్ జోడీ తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ` సినిమా షూటింగ్‌ను చైతన్య త్వరలో ప్రారంభించబోతున్నాడు.