Abn logo
Nov 1 2020 @ 03:16AM

కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోదీ సర్కార్‌

ఏఐటీయూసీ శత వార్షికోత్సవ సభలో చాడ వెంకట్‌రెడ్డి 


హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులపై ఉక్కుపాదం మోపుతూ కార్పొరేట్‌ శక్తులకు, పెట్టుబడి దారులకు మోదీ సర్కార్‌ ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రె్‌స(ఏఐటీయూసీ) శత వార్షికోత్సవాల సందర్భం గా శనివారం నగరంలో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం షాలిమార్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 100 ఏళ్ల ఏఐటీయూసీ పోరాట స్ఫూర్తితో కార్మికులు హక్కులు, చట్టాల రక్షణ కోసం మరింత ఉత్సాహంతో సమరశీల పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు.


యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాలరాజ్‌ అధ్యక్షత వహించిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎ్‌స.బోస్‌, కార్యదర్శి నర్సింహ, కోశాధికారి పి.ప్రేంపావని, మాజీ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌ రావు తదితరులు ప్రసంగించారు. కార్మికలోకానికి విశిష్ట సేవలు అందించిన నాయకులను ఘనంగా సన్మానించారు. మొదట హిమాయత్‌నగర్‌ నుం చి కార్మికులు తెలుగు అకాడమీ, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, కింగ్‌ కోఠి చౌరస్తా మీదుగా ఫంక్షన్‌హాల్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. వెంకటేశం, సత్యనారాయణ, హసీనాబేగం, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement