Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెంట్రల్‌ వర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సులకు.. సెట్‌

న్యూఢిల్లీ: సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల కోసం 2022-2023 విద్యాసంవత్సరం నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) ద్వారా కామన్‌ ప్రవేశపరీక్ష(సెట్‌) నిర్వహించే అవకాశం ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెలిపింది. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సాధ్యమైనచోట నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌)స్కోర్‌ను ఉపయోగించుకోవాలని యూజీసీ సూచించింది. ప్రస్తుతం జేఈఈ, ఎన్‌ఈఈటీ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తున్న మాదిరిగా 13 భాషల్లో ఈ సెట్‌ నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర, ప్రైవేట్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు ఇష్టపడితే వారు కూడా ఈ సెట్‌ను స్వీకరించవచ్చని యూజీసీ పేర్కొంది. 

Advertisement
Advertisement