Abn logo
May 23 2020 @ 20:33PM

మమత అభ్యర్థనపై కోల్‌కతాకు సైన్యం

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం మన్నించింది. అంఫన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు సైన్యాన్ని పంపిస్తోంది. 


అంఫన్ తుపాను బీభత్సం అనంతరం కోల్‌కతాలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు 5 కాలమ్స్ భారత సైన్యాన్ని పంపించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కోల్‌కతా నగర పౌర అధికార యంత్రాంగానికి ఈ సైన్యం సహాయపడుతుంది. ఒక్కొక్క కాలమ్‌లో 35 మంది సిబ్బంది ఉంటారు. 


పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే 26 జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలు సహాయ, పునరావాస కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో 10 బృందాలను అదనంగా పంపిస్తామని ఎన్‌డీఆర్ఎఫ్ ప్రకటించింది.


 

Advertisement
Advertisement
Advertisement