Abn logo
Mar 26 2020 @ 07:49AM

వరణాసి వాసులతో ప్రధాని మోదీ వాట్పాప్ ఛాట్

కేంద్రం ప్రకటన...కరోనా హెల్ప్‌డెస్క్ వాట్పాప్ నంబరు 90131 51515

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో దీన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఈ వైరస్ గురించి విశ్వసనీయమైన సమాచారం ఇవ్వడానికి వీలుగా వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వైరస్ హెల్ప్ డెస్క్ పేరిట 90131 51515 వాట్సాప్ నంబరును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.


కేంద్ర హోంమంత్రిత్వ, ఐటీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వాట్సాప్ హెల్ప్ డెస్క్ నంబరు ద్వార ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వరణాసి ప్రజలతో వీడియో ద్వార మాట్లాడారు. తాను ప్రధానిగా బిజీగా ఉన్నా, వరణాసి ఎంపీగా తాను సహ ఉద్యోగుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ చెప్పారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కరోనా వైరస్ పై విశ్వసనీయ సమాచారాన్ని వాట్పాప్ హెల్ప్ డెస్క్ నంబరు ద్వార అందిస్తామని ప్రధాని మోదీ వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement