Abn logo
Jul 12 2020 @ 07:21AM

కాసేపట్లో గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పెరిగిపోతోంది. టెస్ట్‌లు సక్రమంగా చేయట్లేదని.. ఎక్కువ సంఖ్యలో కూడా చేయట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో గాంధీ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది..? కరోనా బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు..? అని తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్పత్రిని సందర్శించనున్నారు. మరి కాసేపట్లో ఆయన తన సిబ్బందితో ఆస్పత్రికి చేరుకోనున్నారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడనున్నారు. సందర్శన తర్వాత మీడియా మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్‌ల సంఖ్య పెంచాలని.. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని మీడియా ముందు వెల్లడించిన విషయం విదితమే. 


నిన్న భేటీ.. ఇవాళ గాంధీకి!

ఇదిలా ఉంటే.. శనివారం నాడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశం అయ్యారు. భేటీలో భాగంగా తాజా రాజకీయ పరిణామాలు, కరోనా తీవ్రత, కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయం,  భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చించారు. ఆ మరుసటి రోజే కిషన్ రెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement