Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా వ్యాక్సిన్ అందిరికీ అందేలా కృషి: Kishan reddy

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు అధికారులు కృషి చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం దిశ కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద 20 కోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సహకారంతో బస్తీల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర దేశాలు భారత్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. బస్తీ దావాఖానాలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. పథకాలు అమలు చేస్తున్నప్పుడు తలెత్తే సమస్యలను అధికారులు గుర్తించాలన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే పథకాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్వనిది యోజన పథకం హైదరాబాద్‌లో అధికారులు బాగా అమలు చేశారని అభినందించారు. వీధి వ్యాపారులుగా గుర్తింపు కార్డు ఇవ్వడంలో ఆలస్యమవుతుందని.... దానిని అధిగమించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. 

Advertisement
Advertisement