May 9 2021 @ 13:07PM

కార్తీ 'సర్దార్‌'కు అదే హైలెట్

కోలీవుడ్ స్టార్ కార్తీ 'సర్దార్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని చిత్ర బృందం అంటున్నారట. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కార్తీకి జంటగా రాశి ఖన్నా నటిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే సర్దార్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయి విశేషంగా ఆకట్టుకుంది. మరోసారి కార్తీ డిఫ్రెంట్ మేకోవర్‌తో రాబోతున్నాడని కోలీవుడ్‌లో చెప్పుకునేలా ఆయన లుక్ డిజైన్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా తక్కువ మంది చిత్ర యూనిట్ సభ్యులతో షూటింగ్ సాఫీగా సాగుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం మేకర్స్ ఒక భారీ సెంట్రల్ జైలు సెట్‌ను నిర్మించి కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు..హైలెట్‌గా నిలవనున్నాయట. ఇక రీసెంట్‌గా సుల్తాన్ సినిమాతో వచ్చిన కార్తీ డీసెంట్ హిట్ అందుకున్నాడు.